మహిళలకు ఆదాయం సమకూర్చే సరికొత్త మార్గం
A new way to generate income for women
మహిళలకు ఆదాయం సమకూర్చి పెట్టే సరికొత్త పథకానికి స్వాతి నెలవట్ల శ్రీకారం చుట్టారని ప్రముఖ నటి శ్రీ లీల చెప్పారు. మహిళల టాలెంట్‌ను వృత్తిరూపంలో మిచేందుకు సీతా పేరుతో ఈ కొత్త యాప్ రూపకల్పన భేష్ అన్నారు. యాప్ ప్రారంభోత్సవంలో శ్రీ లీల పలు అంశాలు పంచుకున్నారు. ఓ సందర్భంలో ఓ మహిళ ఒక వేదికపై మాట్లాడుతూ... తనకు ఇంట్లో ప్రతిదానికి ఖర్చులకోసం భర్తపైనే ఆధారపడాల్సి వచ్చేదని, ప్రతిసారీ అడగడం ఇబ్బందిగా అనిపించేదని, ఇప్పుడు ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక అలాంటి సమస్య అవసరం లేదన్నారు. ఈ యాప్ ద్వారా ట్యూషన్ బోధనలతో పాటు, సామగ్రి అమ్మకం, చిన్న చిన్న జ్యువెలరీ వ్యాపారం, ఆర్ట్, పెయింటింగ్‌లు వంటి వ్యాపారాలు చేయొచ్చన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ మహిళలకే ప్రత్యేకంగా రూపొందించారని, సురక్షితంగా, ఇంటి దగ్గరి నుంచే టాలెంట్ పెంచుకోవడంతో పాటు.. ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చన్నారు. ఈ యాప్ ఆధారిత సర్వీసు మహిళల్లో చైతన్యం పెంచుతుందని, ప్రతి చిన్న టాలెంట్ ఎంతో అందంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. అయితే, ఇదొక చిన్న స్పేస్ మాత్రమే అని, కానీ.. అది కొత్త అవకాశాలకు ఆధారంగా నిలుస్తుందన్నారు.
