ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట లభించింది ఎట్టకేలకు ఆమె తిరిగి తెలంగాణ క్యాడర్‌ కు రానున్నారు. డీఓపీటీ తనను ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ కు కేటాయించడం పట్ల ఆమె కొద్ది కాలం క్రితం క్యాట్‌ ను ఆశ్రయించారు. ఆమ్రపాలి అభ్యర్ధనను పరిశీలించిన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ ఆమెను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటి ఉత్తర్వులతో నాలుగు నెలల క్రితం రాత్రికి రాత్రి ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎదుట హాజరై జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఆమెకు అక్కడ ప్రాధాన్యతగల టూరిజం శాఖలో ఏపీ ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. అయితే రాష్ట్ర విభజన నాటి నుంచి ఆమ్రపాలి తెలంగాణలో వివిధ జిల్లాలకు కలెక్టరుగా సేవలు అందించడమే కాకుండా పలు కీలక శాఖలకు కార్యదర్శిగా కూడా పని చేశారు. కానీ డీఓపీటీ ఆమెను ఏపీ క్యాడర్‌ కు వెళ్లాల్సిందే అని ఆదేశించడంతో డీఓపీటీ ఆదేశాల మేరకు ఆమో ఏపీ క్యాడర్‌ లో జాయిన్‌ అయ్యారు. ఇదే సమయంలో తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్‌లో పిటిషన్‌ వేశారు. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

Updated On
Politent News Web 1

Politent News Web 1

Next Story