KTR: 20 లక్షల ఇళ్లు నిర్మించాకే ఓట్లు అడగండి! మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్‌కు ప్రతిసవాల్
మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్‌కు ప్రతిసవాల్

KTR: రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాకే ఓట్లు అడగాలని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేసిన సవాల్‌ను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తిప్పికొట్టారు. ఇళ్లు కట్టాకే ఓట్లు అడగాలని కేటీఆర్ ప్రతిసవాల్ వేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణం విషయంలో తనను ఉద్దేశించి మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ గురువారం స్పందించారు.
“పేదలకు సొంతింటి కల సాకారం చేసిన పార్టీ బీఆర్‌ఎస్. మేము డబ్బా ఇళ్లు కాకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించాం. హైదరాబాద్‌లో ఒక్కటి మాత్రమే కాకుండా లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత మా పార్టీది. మా ఒక్క ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, “మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లో మా కంటే ఎక్కువ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి చూపించండి. ఇళ్లు కట్టింది మేము, పడగొట్టింది మీరు. గత రెండున్నరేళ్లలో హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు కట్టారు? ఎన్ని పడగొట్టారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి” అని మంత్రిని సవాల్ చేశారు.
కేటీఆర్ మరిన్ని వ్యాఖ్యలు:
“ప్రభుత్వం ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని డైవర్షన్లు చేసినా 420 హామీల మోసాన్ని మేము ఎండగడుతూనే ఉంటాం. ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లను ఎగవేత చేసిన ద్రోహాన్ని ప్రశ్నించకుండా వదిలిపెట్టేది లేదు” అని కేటీఆర్ హెచ్చరించారు.

