Mahesh Kumar Goud: మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి కుట్రలు పన్నుతోందని, ప్రజాస్వామ్యాన్ని సీఈసీ జ్ఞానేష్ కుమార్ హత్య చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలు గుప్పించారు.

బిహార్, పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసిందని మహేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై రాష్ట్రంలో 92 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా యథేచ్ఛగా ఓటు చోరీ జరుగుతోందని, మోదీ, అమిత్‌షా పాలనలో 12 సంవత్సరాల్లో ప్రజలకు ఎంత మేలు కలిగిందో ఆలోచించాలని సవాల్ విసిరారు.

“మోదీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొవాలి” అని మహేశ్ గౌడ్ అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయనను తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్నామని కూడా చెప్పారు.

Next Story