BJP: తెలంగాణలో భాజపా బలోపేతం కోసం పార్టీ అధిష్ఠానం కీలక చర్యలు చేపట్టింది. పార్టీలోని ముఖ్య నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌లతో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ చేశారు. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ సమావేశం గంటసేపు కొనసాగింది.

సమావేశంలో అభయ్ పాటిల్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంతో సంబంధించిన అంశాల్లో ఇరు నేతలు కలిసి పని చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు.

అనంతరం బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడం కోసం చర్చలు జరిగినట్లు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, బీఆర్‌ఎస్‌పై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు పెరుగుతాయని, జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నమ్మకం వ్యక్తం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చేలా అందరూ కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story