దొంగ ఓట్లతోనే తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిచారు
సంచలన ఆరోపణలు చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులదరూ దొంగ ఓట్లతో గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఎంపీల విజయం తమకు అనుమానాలున్నాయని మహేష్ గౌడ్ వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్న బండి సంజయ్‌తో సహా రాష్ట్రం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ దొంగ ఓట్లతోనే గెలిచారని మహేష్ గౌడ్ పునరుద్ఘాటించారు. తాను చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఓట్లు చోరీ చేసే అవసరం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని మహేష్‌గౌడ్ తెలిపారు. నా సొంత జిల్లా నిమాజాబాద్‌లోనూ దొంగ ఓట్లు ఉన్నాయని, మహారాష్ట్రకు చెందిన అనేక మందికి నిజమాబాద్ జిల్లాల్లో ఓట్లు ఉన్నాయని మహేష్ గౌడ్ చెప్పారు. అలాగే కరీంనగర్ నగరంలో ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో దాదాపు 69 ఓట్లు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని వీటన్నింటిపై విచారణ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. తాజాగా బీహార్ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి పాల్పడటానికి బీజేపీ సిద్దమువుతోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. అయితే బీజేపీ ఓట్లలో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా బీహార్ ప్రజలను చైతన్య పరచడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. బీహార్లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతోందని, అక్కడ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
