కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్‌ఎస్ పోస్టుమార్టం
నేడు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

కళేశ్వరం కమిషన్ నివేదికను పోస్ట్‌మార్టం చేసి ప్రజల ముందు పెట్టాలని భారతీయ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పికాని చంద్ర ఘోష్ కమిషిన్ ఇచ్చిన నివేదిక కాళేశ్వరం నివేదిక కాదని అది కాంగ్రెస్ నివేదిక అని ప్రజలకు వివరించడానికి బీఆర్‌ఎస్ సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ ప్రెజెంటేషన్ హరీష్ రావు ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ఇవ్వనున్న ఈ ప్రెజెంటేషన్‌ను అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ నేతలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాత్రి నుంచే యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై నిన్న సీయం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. మేడిగడ్డ కూలిపోవడానికి పూర్తిగా కేసీఆర్, హరీష్ రావులదే బాధ్యత అని క్యాబినేట్ తేల్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినేట్ సమావేశం అవ్వడాని కంటే ముందే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ పలువురు బీఆర్‌ఎస్ సీనియర్ నేతలతో సమావేశం అయి కాళేశ్వరంపై బీఆర్‌ఎస్ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించార.
