Bullets Found in Aiprot : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల కలకలం
ఓ ప్రయాణికుడి లగేజ్ బ్యాగ్‌లో 8 బుల్లెట్లు కనుగొన్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి లగేజ్ బ్యాగ్ నుంచి 8 లైవ్ బుల్లెట్లను సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి అమృత్సర్ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుని లగేజీ బ్యాగ్ లో 8 లైవ్ బుల్లెట్లను సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. 32 సంవత్సరాల పంజాబ్ వాసి సుఖ్దీప్ సింగ్ అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్సర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతని లగేజీ బ్యాగేజ్ ను సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు చెకింగ్ చేశారు. దీంతో అతని బ్యాగ్ లో 02 నాలుగు, 07రెండు, 7.52 ఒకటి, 7.62 ఒకటి మొత్తం ఎనిమిది లైవ్ బుల్లెట్లు కనిపించాయి. దీంతో బుల్లెట్‌లు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సుదీప్ సింగ్ తన వద్ద ఉన్న బుల్లెట్లకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు చూపించలేకపోవడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. 2023 లో పంజాబ్ లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన బుల్లెట్ లు తన వద్ద ఉన్నాయని వాటిని చూసుకోకుండా తీసుకువచ్చానని ప్రయాణికుడు సుఖ్దీప్ సింగ్ సీఆర్‌పీఎఫ్ అధికారులకు చెప్పాడు. నిందితుడు నాందేడ్ లో గురుద్వార్ దర్శించడానికి బస్సులో ప్రయాణించినట్టు గుర్తించిన అధికారులు ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా విమానంలో ప్రయాణించేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చినట్లు నిందితులు వెల్లడించాడు.
