జూబ్లీహిల్స్‌లోని ఆసుపత్రిలో వైద్యం అందుతోంది.

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ శ్రీశైలం నుంచి తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఆయనకు అస్వస్థత సంభవించింది.

స్థానిక సీబీఐ అధికారులు శనివారం హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీలో ప్రవీణ్ సూద్‌ను కలవాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురవడంతో ఈ సమావేశం జరిగే అవకాశంపై అనిశ్చితి నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story