సెమీకండక్టర్ల యూనిట్‌ తెలంగాణకు కేటాయించకపోవడంపై కేంద్రంపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌బాబు

అభివృద్ధి విషయంలో రాజకీయ నిర్ణయాలు తీవ్ర అభ్యంతరకరమైని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పరిశ్రమల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రవర్తిస్తున్న తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విషయలో కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సెమీకండక్టర్ల యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. అలాగే యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ప్రైమ్‌ లొకేషన్‌లో 10 ఎకరాల స్ధలం కూడా కేటాయించామని శ్రీధర్‌బాబు చెప్పారు. ఇలా అన్నీ సిద్దం చేసి పెట్టినా సెమీ కండక్టర్ల యూనిట్‌ తెలంగాణకు ఇవ్వకుండా ఏపీకి కేటాయించడం కేంద్రప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమని శ్రీధర్‌బాబు విమర్శించారు. పైపెచ్చు సెమీ కండక్టర్ల యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఒక్క ఎకరా స్ధలం కూడా కేటాయించకుండానే ఆ రాష్ట్రానికి యూనిట్‌ మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్షస్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈవిదంగా అభివృద్ధి విషయంలో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం అవమానకరమైన వ్యవహారమని శ్రీధర్‌బాబు అన్నారు. ఇటువంటి వివక్షాపూరితమైన విధానాలను ఎట్టి పరిస్ధితుల్లో సహించబోమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story