CM Revanth Reddy: హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను సోమవారం కలిశారు. ఈ భేటీ సుమారు 20 నిమిషాల పాటు కొనసాగింది. వివిధ అభివృద్ధి, రక్షణ సంబంధిత అంశాలపై ఇరువురు నాయకులు విస్తృత చర్చ నిర్వహించారు.

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు రక్షణ భూములు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన కీలక అంశంగా ఆదిలాబాద్‌లో వాయుసేన విమానాశ్రయానికి పూర్తి సహకారం అందించాలని తెలిపారు. వాయుసేన టెర్మినల్‌తో పాటు కార్గో, ఎమ్‌ఆర్‌ఓ (MRO), హ్యాంగర్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. హ్యాంగర్ల ఏర్పాటుకు ఆదిలాబాద్ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

అంతేకాకుండా, దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో (DRDO) ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి మరియు దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story