CM Revanth Reddy: సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు: భాజపా-బీఆర్‌ఎస్ ఒకే నాణానికి రెండు వైపులు
ఒకే నాణానికి రెండు వైపులు

CM Revanth Reddy: కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాజపా, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణెనికి బొమ్మా బొరుసుల్లాంటివని ఆయన ఆరోపించారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా వారికి వచ్చిందా అని ప్రశ్నించారు.
‘‘రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు. ఇది ప్రజల ఆత్మగౌరవం. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే కార్డు. రేషన్ వ్యవస్థను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకొని పేదలకు సంక్షేమం అందిస్తున్నాం’’ అని సీఎం అన్నారు.
మా పథకాలపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్న ఆయన, భాజపా, బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి ‘‘మీరిచ్చిన దొడ్డు బియ్యం ఏనాడైనా పేదలు వండుకొని తిన్నారా? మేం ఇచ్చిన సన్నబియ్యం బర్రెలకు, కోళ్లకు దాణాగా వాడారా? సన్నబియ్యం ఇవ్వడంతో మార్కెట్‌లో బియ్యం రేట్లు తగ్గాయి. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందన్నారు.. ఏనాడైనా పోయిందా?’’ అని ప్రశ్నించారు.
రైతు సంక్షేమంపై మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ‘‘వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే’’ అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. అయితే ఆయనే వందలాది ఎకరాల్లో వరి పండిస్తున్నారని విమర్శించారు. రూ.500 బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తున్నామని, రైతుబంధు పథకం కింద 37 నెలల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.36 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ రైతు రుణమాఫీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రుణమాఫీ అమలు చేశామని పేర్కొన్నారు. 32 నెలల్లో వడ్లు కొనుగోలు చేసి రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, ఉచిత కరెంటు కోసం ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం రైతుల కోసం లక్షా 75 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే రైతు రాజు అయ్యాడు’’ అని ఆయన అన్నారు.
మహిళలకు సంబంధించి సీఎం మాట్లాడుతూ, గతంలో పాలపిట్ట చీరలు పంపిణీ చేశామని, ఈసారి చిలకపచ్చ చీరలు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఈ పథకానికి రూ.11 వేల కోట్లు ఆర్టీసీకి అందించామని చెప్పారు. ‘‘మా అక్కలు ఉచితంగా ప్రయాణిస్తుంటే ఆ ఛార్జీలు నేను కడుతున్నా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
- RevanthReddyCMRevanthReddySangareddySangareddyNewsBJPBRSTelanganaBJPTelanganaBRSBJPvsBRSBJPAndBRSTwoSidesOfSameCoinTelanganaPoliticsTelanganaCongressCongressTelanganaGovernmentPoliticalNewsTelanganaNewsRevanthReddyCommentsRevanthReddySpeechSangareddyPoliticsHyderabadNewsLatestTelanganaNewsLatestPoliticalNewsLatestIndiaNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

