CM Revanth Reddy Offers Prayers: యాదగిరీశుడి సేవలో సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy Offers Prayers: పవిత్ర యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో సంప్రదాయ వేదపాఠశాల భవనానికి భూమి పూజ నిర్వహించారు.
రూ.43.79 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంలో పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద నిర్మించనున్న ఈ వేదపాఠశాలలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్రంలో అతిపెద్ద వేదపాఠశాలగా రూపొందనుంది.
ఇందితో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వీటిలో:
రూ.9.88 కోట్లతో కొండపై నిత్య కల్యాణం, రంగం మండపం నిర్మాణం
రూ.1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు
రూ.1.44 కోట్లతో మాఢవీధులకు మెట్లు
రూ.43.5 కోట్లతో దీక్షాపరుల మండపం నిర్మాణం
ఈ పనుల మొత్తం వ్యయం దాదాపు రూ.99.55 కోట్లు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, వివిధ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ అభివృద్ధి పనులు యాదగిరిగుట్టను మరింత భక్తుల సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.

