Cm Revanth Reddy : వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన
వరద ప్రభావాన్ని సియంకు వివరించిన ఏడో తరగతి విద్యార్థి

ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ నగరంలోని వరద ప్రభవిత ప్రారంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. గడచిన వారం రోజులుగా ప్రతి రోజు కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. రహాదారులన్నీ నీట మునిగి నడుంలోతు వరద నీరు చేరకుంటోంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్ళలోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్, బుద్దనగర్, మైత్రివనం ప్రాంతాల్లో పర్యటించి వరద ప్రభావిత పరిస్ధితులను స్వయంగా పరిశీలించారు. బుద్దనగర్‌లో డ్రైనేజీ వ్యవస్ధను పరిశీలించిన సీయం కాలనీ రోడ్డు కవటే డ్రైనేజీ కాలువ ఎత్తులో ఉండటంతో వరద నీరు కాలనీలోకి వస్తోందని గుర్తించారు. వెంటనే డ్రైనేజీ వ్యవస్ధను మెరుగు పరచి వరద నీరు సాఫీగా వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీయం ఆదేశించారు. అదే ప్రాంతంలో ఉన్న గంగూబాయి బస్తీ కుంటను పూడ్చివేసి కొంత మంది పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు సీయంకు ఫిర్యాదు చేశారు దీని వల్ల కూడా వరద నీరు రోడ్లపై నిలిచిపోతోందని వారు సీయం దృష్టికి తీసుకు వెళ్లారు. సీయం గంగూబాయి కుంటను పరిశీలించి అక్కడ ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా తక్షణం ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షం పడితే చాలు వరద నీటితో నిలిచిపోయే మైత్రీవనం క్రాస్ రోడ్స్ వద్ద పరిస్ధితిని కూడా సీయం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై మైత్రివనం చౌరస్తాలో నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సీయం అధికారులకు సూచనలు చేశారు. బుద్దనగర్‌లో సీయం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నప్పుడు జశ్వంత్ అనే ఏడో తరగతి చదువుతున్న బాలుడి ని పిలిచి వరద పరిస్ధితిపై వివరాలు అడిగారు. తన ఇంటిలోకి కూడా వరద నీరు చేరుకుందని, ఆ కారణంగా తను చదువుకునే పుస్తకాలు తడిసిపోయాయని జశ్వంత్ సీయంకు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్య మళ్ళీ రాకుండా చూస్తానని సీయం రేవంత్‌రెడ్డి విధ్యార్థి జశ్వంత్‌కు హామీ ఇచ్చారు. సీయం పర్యటనలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీకర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు
