Pamela Satpathy: కొంతకాలంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి శ్వాస సంబం ధిత సమస్యలు.. ముఖ్యంగా సైనస్, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. ఆమె కరీంనగర్లోని స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం చేరారు. వైద్య పరీక్షల అనంతరం, వైద్యులు ముక్కులో ఎముక పెరుగుదల ఉన్నట్లు గుర్తించి, శ్రస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఆమెకు ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) సర్జన్ల బృందం నేతృత్వంలో సెప్టోప్లాస్టిక్ సర్జరీ, ఎండోస్కోపీ నేసల్ సర్జరీ విజయవంతంగా జరిగాయి.

ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు, ప్రత్యేకించి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రులలో శ్రస్తచికిత్స చేయించుకోవడం నిజంగా అరుదైన, ఆదర్శనీయమైన చర్య. ఈ చర్య ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఉన్న అపనమ్మకాన్ని దూరం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా కలెక్టర్ పమేలా సత్పతిని అభినందించారు. ఆమె చర్య ప్రభుత్వాసుపత్రుల సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

Updated On
Next Story