ఒక్కో సారి పోలీసుల ముందకు చిత్ర విచిత్రమైన కేసులు వస్తూ ఉంటాయి. అటువంటి కేసులను ఎలా డీల్‌ చెయ్యాల్లో అర్ధంకాక సతమతమవుతూ ఉంటారు పోలీసులు. అటువంటి కేసే ఒకటి కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కింది. కూకట్‌పల్లిలోని ఓ సూపర్‌ మార్కెట్‌ లో హెరిటేజ్‌ కంపెనీకి చెందిన పాల ప్యాకెట్తు రెండు కొనుగోలు చేసి ఇంటికి వచ్చాక వేడి చేస్తే ఒక ప్యాకెట్‌ బానే ఉండి రెండో ప్యాకెట్‌ విరిగిపోవడంతో సూపర్‌ మార్కెట్లో ఇదేమని ప్రశ్నించగా మేము ఏం చేస్తాం… మాకేం సంబంధం అని సమాధానం రావడంతో సదరు వినియోగదారుడు పోలీసులను ఆశ్రయించాడు. కూకట్‌ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని వినియోగదారుడికి చెప్పి పంపించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story