బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్ల విషయంలో రానాను విచారణకు పిలిచిన ఈడీ

బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్ల విషయంలో టాలీవుడ్‌ ప్రముఖ నటుడు దగ్గబాటి రానా నేడు హైదరాబాద్‌లోని ఎన్‌ఫెర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకానున్నారు. అనుమతి లేని బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్ల వ్యవహారంలో సినీ రంగానికి చెందిన పలువురికి విచారణకు రవాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటికే సినీయర్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌, హీరో విజయ్‌ దేవరకొండలు ఈడీ ముందుకు విచారణకు హాజరై తమ వాదన వినిపించారు. ఇక ముందు తాను ఇలాంటి బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ చేయనని, హానికరమైన వ్యాపారాలకు ప్రమోషన్లు చేయడంలో దూరంగా ఉంటానని విచారణ అనంతరం ప్రకాష్‌ రాజ్‌ మీడియా ముందు ప్రకటించారు. ఇక విజయ్‌ దేవరకొండ తాను ఎలాంటి బెట్టింగ్‌ యాప్స్‌కి ప్రమోషన్ చేయలేదని స్పష్టం చేశారు. తాను ప్రమోట్‌ చేసింది గేమింగ్‌ యాప్‌ అని, ఆ యాప్‌కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, లీగల్‌గా కొనసాగుతున్న గేమింగ్‌ యాప్‌కి మాత్రమే తాను ప్రమోషన్‌ చేసినట్లు విజయదేవరకొండ మీడియా ఈడీ విచారణ అనంతరం మీడియాకు వివరించారు. అయినప్పటికీ ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. తాజాగా సోమవారం ఆగస్టు 11వ తేదీన దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఎల్లుండి బుధవారం ఆగస్టు 13వ తేదీ మంచు లక్ష్మీ కూడా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. అందరి విచారణలు పూర్తైన తరువాత ఈ కేసులో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సైబరాబాద్‌ పరిధిలోని పలు పోలీస్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా మనీ ల్యాండరింగ్‌ కోణంలో ఈడీ ఈ కేసును విచారణ చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ చేసిన విచారణలో మనీ ల్యాండరింగ్‌, ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు ఈడీకి లభింయచలేదని సమచారాం.

Politent News Web 1

Politent News Web 1

Next Story