నోటీసులతో కొత్త మలుపు

Danam Nagender: ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన దానం నాగేందర్‌ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీ మారినందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని, అసెంబ్లీ స్పీకర్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. నామినేషన్‌ వేసిన రోజు నుంచే దానం నాగేందర్‌ అనర్హుడని ప్రకటించాలని పిటిషన్‌లో డిమాండ్‌ చేశారు.

కర్ణాటక, బిహార్‌లో ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం ఏలేటి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లు గతంలో స్పీకర్‌ వద్ద విచారణకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు ద్వారా సవాలు ఎదురవడంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story