Congress State In-Charge Meenakshi Natarajan: అర్హులైన ఓటర్ల ఓట్లు ఒక్కటి కూడా గల్లంతు కాకుండా చూడాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ డీసీసీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పర్యవేక్షకులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఏ ఓటు తొలగిపోయినా ఆ బాధ్యత వారిదేనని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం గాంధీభవన్‌లో డీసీసీలు, పర్యవేక్షకులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించిన మీనాక్షి, తెలంగాణలో సర్‌ కార్యక్రమాల అమలు, పార్టీ నేతల పనితీరుపై సమీక్షించారు. ఎక్కడైనా అర్హుల ఓట్లు తొలగిస్తే ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయవద్దని కూడా మీనాక్షి ఆదేశాలు ఇచ్చారు. ఆహార వ్యర్థం కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, అవసరమైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నవారికి దానం చేయాలని చెప్పారు. సీనియర్‌ నాయకులు వచ్చినప్పుడు జేసీబీలు, బుల్‌డోజర్లతో భారీ గజమాలలు వేయడం మానాలని, ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు పీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్‌రావు మీనాక్షి పేరుతో ప్రకటన విడుదల చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story