శ్రీకృష్ణ శోభాయాత్ర సందర్భంగా ఉప్పల్‌లో తీవ్ర విషాదం
విద్యుదాఘాతంతో ఐదుగురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉప్పల్ పరిధిలోని రామాంతపూర్ గోకుల్ నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి గోకుల్ నగర్‌లో నిర్వహించిన శ్రీకష్ణ శోభాయాత్ర సందర్భంగా ఈ అపశృతి చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా గోకుల్ నగర్ వాసులు నిర్వహించిన ఈ శోభాయాత్ర ముగింపు సమయంలో రథాన్ని తీసుకు వెళుతున్న వాహనం ఆగిపోవడంతో ఓ మంది యువకులు రథాన్ని నెట్టుతూ ముందుకు తీసుకు వెళుతున్నారు. ఈ క్రమంలో రథానికి పైన అతి దగ్గరగా ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో ఒక్కసారిగా రథం నెటుతున్న పది మంది యువకులకు విద్యుదాఘాతం తగిలి ఎగిరి దూరంలో పడ్డారు. వెంటనే విద్యుదాఘాతానికి గురైన అందరినీ సమీపంలో ఉన్న మ్యాట్రిక్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిల ఐదుకు గురు అక్కడిక్కడే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రికి చేరకున్న పోలీసులు మృతదేహాలను మ్యాట్రిక్స్ ఆసుపత్రి నుంచి గాంధీ మార్చురీకి తరలించారు. గయాలైన వారిలో ఒకరు మ్యాట్రిక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో ఇద్దరిని నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో వైద్య సేవలు తీసుకుంటున్నారు. మృతులు కృష్ణయాదవ్(21), శ్రీకాంత్‌రెడ్డి(35), సురేష్ యాదవ్ (34) రుద్ర వికాస్(39), రాజేందర్‌రెడ్డి(45)లుగా గుర్తించారు.
