Minister Tummala: కాళేశ్వరం వివాదంలో నన్ను చేర్చవద్దు: మంత్రి తుమ్మల
వివాదంలో నన్ను చేర్చవద్దు

Minister Tummala: కాళేశ్వరం వివాదంలో తనను అనవసరంగా లాగుతున్నారని, 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఎక్కడా తప్పు చేయలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టంగా తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తప్పును ఈటల తన భుజాలపై దించుకుంటున్నారని అన్నారు. కమిషన్ ముందు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు అబద్ధాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అవసరం అయితే ఆధారాలతో సహా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సెక్రటేరియట్‌లో తుమ్మల మాట్లాడుతూ, 'ఈటల ప్రకటన అసత్యం. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు సరైనవి కాదని అన్నారు. కాళేశ్వరం డిజైన్లకు కేబినెట్ ఆమోదం లేదు. సబ్ కమిటీకి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధం లేదు. ప్రాణహిత-చేవెళ్ల పై మేము రిపోర్టు ఇచ్చామని, రాష్ట్రానికి లాభం జరిగే సూచనలు చేసామని తెలిపారు. ఉమ్మడి నిర్ణయం అని ఈటల చెప్పడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. త్వరలోనే కమిషన్‌కు లేఖ రాస్తామని, అతనికి అవసరమైతే జీవో కూడా బయటకు ఇస్తామని చెప్పారు.'
