ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్… పరారిలో మరో ఇద్దరు...!

వీకెండ్‌ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నగర శివారుల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో రేవ్‌, పార్టీలు, డ్రగ్స్‌ పార్టీలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతి వీకెండ్‌లో పోలీసులు శివారు ఫామ్‌హౌస్‌లపై దాడులు చేసి డ్రగ్స్‌, ఫారిన్‌ లిక్కర్‌ పట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా మోయినాబాద్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌పై ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు ఐటీ ఉద్యోగులను పట్టుకోగా మరో ఇద్దరు పరార్‌ అయ్యారు. స్నేహితుడి బర్త్‌డే పార్టీలో ఎల్‌ఎస్‌డీ బ్లెట్స్‌, హాష్‌ ఆయిల్‌ మద్యంతో వీరు పార్టీ చేసుకుంటున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఫామ్‌హౌస్‌లో సోదాలు జరిపారు. అక్కడ ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, హాష్‌ ఆయిల్‌ దొరికాయి. ఖరీదైన మద్యంతో పాటు 0.5 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఎల్ ఎస్ డి బ్లాస్ట్, 20.21 గ్రాముల హరీష్, ఐదు ఖరీదైన మద్యం బాటిల్లతో డ్రగ్స్ తీసుకుంటూ మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి తీసుకు వచ్చినట్లు విచారణలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు ఐటీ ఉద్యోగులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్‌ చేయగా మరో ఇద్దరు ఐటీ ఉద్యోగులు తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనలో ఐటీ ఉద్యోగుల నుంచి డ్రగ్స్‌, లిక్కర్‌ బాటిల్స్‌, మూడు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్‌ బెనర్జీ అనే ఐటీ ప్రొఫెషనల్‌ తన బర్త్‌డే పార్టీ సందర్భంగా ఈ ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్‌ టెస్ట్‌లు చేయించగా అందరికీ పాజిటివ్‌ వచ్చింది. వీరందరిపై కేసులు నమోదు చేసి చేవెళ్ళ పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story