ED Case : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో సెలబ్రిటీలపై ఈడీ కేసు
29 ఇన్‌ఫ్లుయెన్షర్లపై మనీ లాండరింగ్ కేసు నమోదు

బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేసినందుకు పలువురు సెలబ్రిటీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. సినీ, టీవీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షర్స్ అనేక మంది అక్రమ బెట్టింగ్ అప్లికేషన్‌లను ప్రమోట్ చేశారనే అభియోగంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహరాంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఉల్లంఘనలు ఉన్నాయని ఈడీ గుర్తించింది. బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించడం ద్వారా చట్టవిరుద్దమైన ఆన్ లైన్ బెట్టింగుల్లో పాల్గొనడానికి ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షర్లు ప్రమోషన్లు చేశారని ఈడీ పలువురిపై అభియోగాలు మోపింది. ఈ జాబితాలో సినీ నటుల, బుల్లితెర ప్రముఖులు, డిజిటల్ మీడియా సెలబ్రిటీలు ఉన్నారు. ఈ మూడు రంగాలకు సంబంధించిన దగ్గుబాటిరానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, ప్రణీతా సుభాష్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, మంచు లక్ష్మిలు, సిరిహనుమంత్, వర్శీ సోజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతచౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పాండు, విష్ణుప్రియ, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజా, రీతు చౌదరి, బండారు శేషాయని సుప్రీత, రణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, లోకల్ బాయ్ నానితో పాటు మొత్తం 29పై ఈడీ కేసులు నమోదు చేసింది. ఈవిధంగా బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్లు చేయడం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు ఈ సెలబ్రిటీల్లో ఏ ఒక్కరూ తమ ఐటీ రిటర్న్స్ లో చూపించలేదనేది ఈడీ ఆరోపణ.
