Enforcement Director: లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసు: బష్రత్ ఖాన్ ఇంటిపై ఈడీ దాడులు
బష్రత్ ఖాన్ ఇంటిపై ఈడీ దాడులు

Enforcement Director: లగ్జరీ కార్ల అక్రమ దిగుమతి కేసులో హైఎండ్ కార్ల వ్యాపారి బష్రత్ ఖాన్‌కు చెందిన జూబ్లీహిల్స్ నివాసం, గచ్చిబౌలిలోని షోరూంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది.
గచ్చిబౌలిలో 'ఎస్‌కే కార్ లాంజ్' పేరుతో షోరూం నిర్వహిస్తున్న బష్రత్ ఖాన్‌ను గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసి, వాటిని విక్రయించడం ద్వారా రూ.100 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు DRI ఆరోపించింది. ఓడరేవులలో ఉద్దేశపూర్వకంగా తక్కువ ఇన్‌వాయిస్ విలువలను చూపించడం ద్వారా ఈ కార్లను సుమారు 50% తక్కువ విలువతో దిగుమతి చేసినట్లు DRI కనుగొంది.
మే 15, 2025న బష్రత్ ఖాన్‌ను DRI అరెస్టు చేసింది. ఈ కేసులో దాదాపు 30 ఖరీదైన కార్లను అక్రమంగా దిగుమతి చేసి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈడీ అధికారులు బష్రత్ ఖాన్ ఇంటితో పాటు అతని షోరూంలో కూడా తనిఖీలు నిర్వహించారు.
