✕
ఈసీ ఆదేశం

x
Kavitha: కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ పేరుపై భారీ సంఖ్యలో అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. దీంతో పార్టీ పేరు మార్చుకోవాలని కవితను కోరుతూ ఈసీ లేఖ రాసింది. ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కూడా ఆదేశించింది.
ఈసీ లేఖకు స్పందించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు, కేవలం రెండు అభ్యంతరాలను మాత్రమే తమకు తెలియజేసినట్లు వెల్లడించారు. మిగతా ఫిర్యాదుల వివరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా సూచించాలని ప్రశ్నించారు. పార్టీ పేరు అంశంపై అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ అభ్యంతరాలు ఎలా పరిష్కరించాలనేది ప్రస్తుతం టీఆర్‌ఎస్ నాయకత్వం ఆలోచిస్తోంది. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

PolitEnt Media
Next Story
