✕
Danam Nagender Slams BRS: ఉప ఎన్నిక వచ్చినా మళ్లీ గెలుపు నాదే.. బీఆర్‌ఎస్‌పై దానం నాగేందర్ ధ్వజం
By PolitEnt MediaPublished on 27 Dec 2025 4:35 PM IST
బీఆర్‌ఎస్‌పై దానం నాగేందర్ ధ్వజం

x
Danam Nagender Slams BRS: ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా, ఉప ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం తనకు ఉందని, అది కార్యకర్తల అండ నుంచి వచ్చిందని స్పష్టం చేశారు.
కార్యకర్తల మద్దతుతోనే తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని గుర్తు చేసుకున్నారు. ఉప ఎన్నిక జరిగినా మరోసారి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే, బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వడం ఆ పార్టీ నేతలు మరచిపోయారని విమర్శించారు. సీఎంను ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడినవాళ్లు బీఆర్‌ఎస్ వారేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే ప్రతివిమర్శలను కూడా ఎదుర్కోవాల్సిందేనని హితవు పలికారు.

PolitEnt Media
Next Story
