అందరికీ తెలుసు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Former Minister Jagadish Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై కుట్ర జరుగుతోందని, కేసీఆర్‌ స్థాయి ఏంటో అందరికీ తెలుసని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రేవంత్‌ రెడ్డి ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌ పాలన మీద జనం ఆగ్రహంతో ఉన్నారని ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. రేవంత్‌ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే రేవంత్ తల దించుకోవాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కుర్చి అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి పాలనను అసహ్యించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిందని ప్రజలు గ్రహించారని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పతనమవుతుందని జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త శక్తికి మించి పనిచేయాలని అప్పుడే విజయం చేకూరుతుందని అన్నారు. కెసీఆర్ మీద వస్తున్న ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story