కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు… పది మంది మృతి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి రసాయన పరిశ్రమలో రియాక్ట్ పేలి పది మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో కార్మికులు క్షతగాత్రులయ్యారు. పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఉన్న సీగాచి కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికులందరూ పని చేస్తుంగా ఉదయం 9గంటల సమయంలో పెద్ద శబ్ధంతో రియాక్టర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఐదు మంది కార్మికులు సజీవదహనం అయిపోయారు. పేలుడు కారణంగా పరిశ్రమలో భారీ స్ధాయిలో మంటలు ఎగిసి పడుతున్నాయి. పేలుగు ధాటికి అక్కడ ఉన్న కార్మికుల్లో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందార. దాదాపు ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. సంఘటనా స్ధలానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. రియాక్టర్ పేలుడు ధాటికి అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలి పోయింది. కూలిన అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి ఆరుగురిని మాత్రమే రెస్క్యూ టీమ్ బయటకు తీసుకు రాగలిగింది. ఇంకా దాదాపు పదిహేను మంది వరకూ శిధిలాల కింద చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. రియాక్టర్ పేలుడు శబ్ధం బిగ్గరగా వినిపించడంతో చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల వాసులు భయాందోళనలకు గురయ్యారు. పేలుడు శబ్ధం విన్న స్థానికులు పెద్ద యెత్తున కంపెనీ వద్దకు చేరుకున్నారు. కంపెనీలో ఉన్న కార్మికులు పెలుడు ధాటికి భయకంపితులై బయటకు పరుగులు తీశారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను ఆసుత్రికి తరలించాయి. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఆగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితులను పరిశీలిస్తున్నారు.
