ఎరిమల్లె వాగు మీదుగా ఏదులాబాద్ లక్ష్మినారాయణ చెరువులోకి వ్యర్థాలు

మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్ చెరువులో కలుషిత జలాలతో టన్నుల్లో చేపలు మృతి చెందాయి. ఇటీవల భారీ వర్షాలకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన కలుషిత జలాలతోనే చేపలు మృతి చెందాయని ఏదులాబాద్ గంగపుత్ర సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఎరిమల్లె వాగు మీదుగా ఏదులాబాద్ లక్ష్మినారాయణ చెరువులోకి వ్యర్థాలు చేరి అపార నష్టం చేకూర్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని కొన్ని పరిశ్రమల నుంచి దొంగచాటుగా అర్దరాత్రి తరలిస్తున్న వ్యర్థాలు కూడా కారణమని ఆరోపిస్తున్నారు. సుమూరు పది లక్షల విలువ చేసే చేపలు పనికి రాకుండా పోయాయని తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకుడు పూస జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టం నుంచి గంగపుత్రులను ఆదుకోవాలని జనార్దన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Politent News Web3

Politent News Web3

Next Story