డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క

నిధుల సమీకరణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ మల్లు సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కమిటీ సమావేశం అయ్యింది. కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో సబ్ కమిటీ సభ్యుడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రతివారం జరుగుతుందని, తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిని వచ్చేవారం సమావేశంలో అంశాల వారీగా సమీక్షిస్తామని తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నిర్మించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో శాఖల వారీగా అంశాలను డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ,సి సి ఎల్ ఏ సెక్రటరీ నవీన్ మిట్టల్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ , కమిషనర్లు హరిత, హరికిరణ్, విష్ణువర్ధన్, సురేంద్రమోహన్, బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇలంబర్తి , ఆర్ వి కర్ణ న్ తదితరులు పాల్గొన్నారు.
