ఆర్‌ఎస్‌ఎస్‌లో తనకు శిక్షణ ఇచ్చిన గురువులను సన్మానించిన దత్తన్న



మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో తన గురుతుల్యులను సన్మానించారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌లోని తన నివాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో తనకు గురుస్ధానంలో ఉన్న డాక్టర్‌ మనోహర్‌ షిండే, డాక్టర్‌ బీరవోలు సురేందర్‌రెడ్డి, వల్ల భాగయ్య, రామచంద్రయ్యలకు దత్తాత్రేయ ఘన సత్కారం చేశారు. దత్తాత్రేయను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో చేర్పించి శిక్షణ ఇచ్చి, సంస్కారంతో పాటు జాతీయ భావాలు, దేశభక్తితో స్పూర్తి నింపిప మనోహర్‌షిండే ప్రస్తుతం కాలిఫోర్నియాలో స్థిర నివాశం ఏర్పారచుకున్నారు. అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకాలపాల సంఘచాలక్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న షిండే హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా దత్తాత్రేయ గురు సత్కార కార్యక్రమం నిర్వహించారు. అలాగే తనను సంఘ కార్యకలాపాలను ఇంకా అభివృద్ధి చేయడానికి, మానవ సంబంధాలు,వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా చేయాలో నేర్పించిన గురువు బీరవోలు సురేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత కార్యవర్గ సభ్యులు వడ్ల భాగయ్ తనతో పాటు ప్రచారక్‌గా పనిచేసి ప్రస్తుతం వనవాసి కళ్యాణ్‌ ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తున్న రామచంద్రయ్యలకు బండారు దత్తాత్రేయ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చి వారిని శాలువాతో సత్కరించారు. ఈసన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, లోక్‌సభ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకేఅరుణ, ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ మనోహర్‌రావు, 93 సంవత్సరాల స్వయం సేవక్‌ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story