రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం
ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, డిసేబుల్ ట్రస్ట్, బద్రీ విశాల్ పానలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, మహావీర్ వికలాంగ సహాయత సమితి, డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్, రామదేవ్ రావు హాస్పిటల్, జనజాగృతి ట్రస్ట్‌ల సహకారంతో ఉచిత మెగా శస్త్రచికిత్స మరియు వైద్య శిబిరం సోమాజిగూడలోని సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి వికలాంగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్, కర్రలు, కేలిపర్స్, కృత్రిమ అవయవాలు, వాకర్స్ వీల్ చెయర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ వికలాంగుల పునరావాసం, వినోదం, క్రీడల ప్రాధాన్యం గురించి వివరించారు. మంత్రి అడలూరి లక్ష్మణ్ మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరపున తగిన నిధులు సమకూరుస్తానని, సహాయ చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కలెక్టర్ హరీచందనలతో పాటు ఎమ్మెల్యే యాదయ్య, రెడ్ క్రాస్ స్టేట్ సీఈఓ శ్రీరాములు, చైర్మన్ భీమ్‌రెడ్డి తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
