రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి

Chada Venkat Reddy: అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని నడిపిస్తున్న సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అరెస్టు చేయడాన్ని దుర్మార్గమైన చర్యగా సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇన్నయ్యను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవనంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి, గాదె ఇన్నయ్యను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ అంటే మొదటి నుంచి ఇష్టం లేదని, అందుకే ఆయన పేరును ఉపాధి హామీ చట్టం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా సీపీఐ శతవార్షిక ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న ఖమ్మంలో విజయవంతం చేయాలని ఆయన ప్రజలందరినీ కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story