Women’s Commission Chairperson: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను కూడా నియమిస్తూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిషన్‌లో సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత, శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా ఉన్నారు. కొత్తగా నియమితులైన ఈ కమిషన్ ఐదేళ్ల పాటు కొనసాగనుంది.

గద్వాల విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌గా పనిచేశారు. మహిళల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం వంటి అంశాలపై ఈ కమిషన్ దృష్టి సారించి పనిచేయనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story