BJP State President Ramchander Rao: ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు గ్యాస్ కొరత సృష్టిస్తున్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

BJP State President Ramchander Rao: దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏమాత్రం లేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ కొరతను సృష్టిస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
“యుద్ధం కారణంగా పలు దేశాల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. కానీ మన దేశంలో మాత్రం ధరలు పెరగకుండా మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా నియంత్రణలో ఉంచింది. గతంలో ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.1,200 ఉంటే.. మోదీ సర్కారు దానిని రూ.900కి తగ్గించి ప్రజలకు ఊరట కలిగించింది” అని రామచందర్‌రావు వివరించారు.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు కేటాయించాలని ప్రకటనలు వస్తున్నాయని ప్రస్తావిస్తూ.. “మూసీ ప్రాజెక్టుకు బీజేపీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. అయితే, 50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదు. గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం 100 ఎకరాలు కావాలా? గుజరాత్‌లో సబర్మతి ప్రాజెక్టును ఎవరికీ ఎలాంటి నష్టం కలగకుండా పూర్తి చేశాం” అని ఆయన ఉదాహరణ ఇచ్చారు.

