సిబిఐకి అనుమతిస్తూ జీవో

CBI: 2022 ఆగస్ట్లో రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టకుండా జారీ చేసిన జీవోను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో దానికనుగుణంగా తాజా జీవోను విడుదల చేసింది. నేషనల్ డాన్స్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజి వైఫల్యానికి ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నాణ్యత లోపాలు కారణం అని తన తుది నివేదికలో పొందుపర్చింది. ఈ అంశాల ఆధారంగా సీబీఐ విచారణ జరపనుంది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదికను కూడా జీవోలో జత చేస్తూ ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణలో NDSA నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరుగుతుందని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సులపై చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతిస్తూ సోమవారం ఇచ్చిన జీవోలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో వైఫల్యాలపై విచారణ అని కూడా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ నివేదికపై కోర్టులో కేసు ఉన్నందున NDSA నివేదికలోని అంశాలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గతంలో జారీ చేసిన జీవో కి సడలింపు ఇస్తూ.. సోమవారం జారీ చేసిన జీవోను వెంటనే కేంద్రానికి పంపగా.. అందినట్లు సీబీఐ డైరెక్టర్ నుంచి అకనాలెడ్జ్‌మెంట్ కూడా సోమవారం వచ్చింది. దీంతో కాళేశ్వరం బ్యారేజీల అంశం సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది.


జీవో లోని ముఖ్యమైన అంశాలు

2022 ఆగస్ట్ 30 న రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన జీవో 51 ని సవరిస్తూ సోమవారం ప్రభుత్వం జీవో 104 ను జారీ చేసింది. ఈ జీవోలో ఈ అంశంపై విచారణ జరపాలో పేర్కొంది. గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించారు. మేడిగడ్డ ఏడు బ్లాక్ 16,17,18,19,20,21 పిల్లర్స్ 2023 అక్టోబర్ 21 న కుంగాయి. 2023 అక్టోబరు 22 న నేషన్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీని ఏర్పాటు చేసింది. 2023 అక్టోబర్ 24 న ఆ కమిటీ పర్యటించి నంబర్ ఒకటిన తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2024, మే 1 న మధ్యంతర నివేదిక 2025 ఏప్రిల్ 24 న తుది నివేదిక సమర్పించింది. నిర్మాణంలో లోపాలు, ప్లానింగ్ డిజైన్, నాణ్యత, తనిఖీలు సరిగ్గా లేకపోవడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం చెందినట్లు నేషనల్ బ్యాంక్ సేఫ్టీ అధికారిటీ పేర్కొంది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 2024 మార్చ్ 14 న ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జులై 30 వ తేదీన కమిషన్ తుది నివేదిక సమర్పించింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలు చోటు చేసుకున్నాయని, అనేక అక్రమాలు జరిగాయని, తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నివేదికపై ఆగస్టు 4 న మంత్రివర్గం చర్చించి శాసనసభలో నివేదికను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఆగస్ట్ 31 న శాసనసభలో చర్చించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీబీఐకి రాష్ట్రంలోకి ప్రవేశం ప్రవేశాన్ని నిరోదిస్తూ 2020 ఆగస్ట్ 20 న జారీచేసిన ఉత్తర్వులకు సడలింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు, పబ్లిక్ సర్వెంట్పై దర్యాప్తునకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం సీబీఐకి పూర్తి సహకారం అందిస్తుందని జీవోలో పేర్కొనడంతో పాటు ఇదే అంశాన్ని కేంద్రానికి తెలిపింది.


తదుపరి కార్యాచరణ

సీబీఐ అన్ని అంశాలను పరిశీలించి డీఓపీటీ అనుమతి కోసం పంపుతుంది. డీఓపీటీ దాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టడానికి అంగీకరిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అయితే సీబీఐ కేసు నమోదు చేయాలంటే గవర్నర్ నుంచి అనుమతి అవసరం. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తప్పుబట్టింది. నేషనల్ డాన్స్ సేఫ్టీ అథారిటీ నివేదికలో ప్రజాప్రతినిధుల పేర్లు లేనందున, ఈ నివేదిక ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేయుటకు గవర్నర్ అనుమతి అవసరం అవుతుందో లేదో అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story