దుబ్బాకలో వినూత్నంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసిన యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్

ఇక్కడ మీరు చూస్తున్న ఈ వినాయక మండపం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇక చూడగానే ఇట్టే అర్థమయిపోవచ్చు. మండపానికి ఇరువైపులా బాల్యం ఫోన్లో బందీ కావద్దు, భవిష్యత్తు ఆగం కావద్దు అంటూ స్లొగన్స్, కార్టూన్ లతో ఏర్పాటు చేసి, సెల్ఫోన్లకు చిన్నారులను దూరంగా ఉంచాలనే వినాయక మండపం నుండి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నేటితరం చిన్నారులు సెల్ ఫోన్ చేతిలో ఉంటే కానీ తినడం , వినడం చేయని పరిస్థితి అందరికీ తెలిసిందే. సెల్ ఫోన్ మాయలో పడి చిన్నారులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధానంగా తల్లిదండ్రులే కారణం. వినాయక మండపానికి వచ్చే భక్తులకు సెల్ ఫోన్ కట్టిపెట్టి, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఇప్పుడు అందరిని ఆకర్షించడమే కాకుండా, ఆలోచింపజేసే విధంగా చేస్తుంది.. సెల్ఫోన్ గేమ్స్ కు పిల్లలు దూరం చేసి, క్రీడా ప్రాంగణాలకు దగ్గర చేయాలంటూ మండపానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు సూచనలు చేస్తున్నారు. ఇలా వచ్చే భక్తులకు భక్తికి తోడుగా, చిన్నారుల బంగారు భవిష్యత్తు నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నారు. దుబ్బాక పట్టణంలో ఎన్ని వినాయక మండపాలు ఉన్న సామాజిక స్పృహ కల్పిస్తూ అందరికి యువకిరణo స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో నిస్సందేహము లేదు. మండపం చిన్నదా, వినాయకుడు పెద్దదా అంటూ చర్చలు కాదు, ఇప్పుడు దుబ్బాకలో ఎక్కడ చూసినా విద్యార్థుల భవిష్యత్తు ,చిన్నారులు సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఆలోచన చేసిన వినాయక మండపమే అందర్నీ ఆలోచింపజేస్తూ, భక్తులకు సైతం వరాలు ఇచ్చే మండపంగా మారుతుంది.. దుబ్బాక పట్టణంలోని భక్తులే కాకుండా గ్రామీణ ప్రాంత భక్తులు సైతం యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మండపాన్ని వీక్షించి, గణనాథుడిని దర్శనం చేసుకుని అరచేతిలో స్వర్గం, జీవితమంతా నరకం కావద్దంటూ చిన్నారుల భవిష్యత్తు కోసం ఆలోచింపజేస్తున్న అసోసియేషన్ సభ్యులు శభాష్ అంటూ పొగిడేస్తున్నారు భక్తులు..

Updated On 30 Aug 2025 2:31 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story