Has Kavitha been humiliated again?

కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఘోర అవమానం జరిగిందా? అంటే బీఆర్‌ఎస్ శ్రేణులు, కేసీఆర్ సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరయ్యేందుకు ఫామ్‌హౌజ్ నుంచి బయలు దేరిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలు దీనికి నిదర్శనమంటున్నారు. ఇప్పుడీ అంశం బీఆర్‌ఎస్‌తో పాటు.. తెలంగాణ జాగృతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిబంధనలు పాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీచేసింది. దీంతో, కేసీఆర్ విచారణ కమిషన్ ముందుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ నుంచి కేసీఆర్ బయలుదేరి బీఆర్‌కే భవన్‌కు వెళ్లారు. అయితే, కేసీఆర్ తొలిసారి ఓ విచారణకు హాజరవుతున్న సందర్భంలో బీఆర్‌ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో పలువురు ముఖ్యనేతలు, కేసీఆర్ సన్నిహితులు కూడా ఫామ్‌హౌజ్‌కు వెళ్లి ఉదయమే కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉదయాన్నే ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. తన భర్త అనిల్‌కుమార్‌తో పాటు కవిత ఎర్రవల్లి వెళ్లారు. అయితే, అక్కడ కవితకు అవమానం జరిగినట్లు అంతా చెప్పుకుంటున్నారు.
తండ్రికి సంఘీభావం తెలపడానికి, ఇటీవలి కాలంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి తండ్రికి వివరించేందుకు ఉదయాన్నే కవిత, తన భర్తతో కలిసి ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. అయితే, ఫామ్‌హౌజ్‌లోపలికి, ఇంట్లోకి వెళ్లినప్పటికీ.. తండ్రి కేసీఆర్ ఉన్న పై అంతస్తుకు కవిత వెళ్లలేదని తెలుస్తోంది. విచారణకు బయలుదేరే హడావిడిలో ఉన్న కేసీఆర్.. తన కూతురు కవితను అంతగా పట్టించుకోలేదని అంటున్నారు. అందుకే పై అంతస్తుకు కూడా వెళ్లలేదంటున్నారు. అంతేకాదు.. బయటకు వెళ్లేందుకు లిఫ్ట్‌లో కిందకు దిగిన కేసీఆర్ కూతురివైపు కనీసం చూడలేదు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. కేసీఆర్ కిందకు దిగుతున్నారని తెలిసి కవిత లిఫ్ట్ పక్కనే కొంత దూరంగా నిల్చున్నారు. అయితే, లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కూతురు కవిత వైపు చూడకుండానే, ఆమెతో మాట్లాడకుండానే ముందుకు వచ్చి చేతికి దట్టీ కట్టించుకున్నారు. ఆ తర్వాత వాహనం ఎక్కి వెళ్లిపోయారు. కవిత మాత్రం కేసీఆర్‌కు డిస్టర్బ్ చేయకుండా ఆయన వెనకాలే బయటకు వచ్చి.. తన భర్తతో కలిసి మరో వాహనంలో కేసీఆర్ వాహనాన్ని అనుసరించారు.
ఈ పరిణామాలు గమనించిన వాళ్లు.. కవితతో ఇంకా కేసీఆర్‌కు సయోధ్య కుదరలేదని అనుకుంటున్నారు. కూతురిని కేసీఆర్ ఇంకా దగ్గరకు తీసుకోవడం లేదని, ఇటీవలి కాలంగా జరిగన పరిణామాలతో ఇంకా కూల్ కాలేదని చర్చించుకుంటున్నారు.
