స్మితా సభర్వాల్‌కు హైకోర్టు ఉపశమనం

Smita Sabharwal: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

స్మితా సభర్వాల్ ఈ కమిషన్ నివేదికను హైకోర్టులో సవాల్ చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు ప్రక్రియలలో అనుసరించిన విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story