రికార్డు స్ధాయికి చేరిన హైదరాబాద్ భూముల ధరలు

- హౌసింగ్ బోర్డు స్ధలాలకు విపరీతమైన డిమాండ్
- గచ్చిబౌలిలో గజం రూ2.22 లక్షలకు కొనుగోలు
హౌసింగ్ బోర్డు స్ధలాల వేలంలో మరోసారి రికార్డు స్ధాయిలో ధరలు పలికాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు ఉన్న స్ధలాలకు గత కొన్ని రోజులుగా బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఇటీవలే కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కాలనీలో వేసిన స్ధలానికి రికార్డు స్ధాయిలో దాదాపు మడు లక్షల రూపాయల చొప్పున గజం ధర పలికింది. తాజగా గచ్చిబౌలిలో ఉన్న హౌసింగ్ బోర్డు స్ధలాలకు వేలం వెయ్యగా ఒక్క స్ధలాన్నే 33 కోట్ల రూపాయలు పెట్టి కొనడానికి ముందుకు వచ్చారు. అదే గచ్చిబౌలిలో మరో స్ధలానికి రూ13.51 కోట్ల ధర పలికింది. చివరికి ఎంఐజీ ప్లాట్లను కూడా రూ.4.50 కోట్లకు పైగా వెచ్చించి బహిరంగ వేలంలో దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. హైదరాబాద్ పరిసరాల్లోని గచ్చిబౌలి, నిజాంపేట, చింతల్ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లను హౌసింగ్ బోర్డు వేలం వేయగా రూ.65.02 కోట్ల వరకూ ఆదాయం సమకూరినట్లు హౌసింగ్ కమిషనర్ వీపీగౌతం తెలిపారు. చింతల్ ప్రాంతంలో 266 చదరపు గజాల నివాస స్ధలాలు, నిజాంపేటలో 413 గజాల స్ధలం, గచ్చిబౌలి ప్రాంతంలో కమర్షిల్ ప్లాట్లను సోమవారం హౌసింగ్ బోర్డు ఆక్షన్ కి పెట్టింది. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 1487 గజాల కమర్షియల్ ల్యాండ్ ని గజం రూ.2.22లక్షలకు పాడి రూ.33 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ స్ధలానికి చరరపు గజానికి లక్షా 20 వేల రూపాయలను ఆఫ్ సెట్ ధరగా నిర్ధారించగా గజం రూ2.22లక్షలు పలికింది. ఇదే ప్రాంతంలో మరో 1200 గజాలకు వేలం వేయగా గజం రూ.1.12 చొప్పున దక్కించుకున్నారు. ఒక్క గచ్చిబౌలి ప్రాంతంలోనే స్ధలాలను వేలం వేయడం ద్వారా 55 కోట్ల 56లక్షల 84 వేల రూపాయలను హౌసింగ్ బోర్డు అర్జించింది.
