ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడింది!

గచ్చిబౌలి-కొండాపూర్‌లో జంగంకుంటను రక్షించిన హైడ్రా బృందం

HYDRA: నగరంలో భూ ఆక్రమణాలపై హైడ్రా (HYDRA) అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. గచ్చిబౌలి-కొండాపూర్ ప్రాంతాల్లో సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చేతుల నుంచి రక్షించింది.

కొండాపూర్‌లోని జంగంకుంట ఆక్రమణాలపై హైడ్రా అధికారులు పూర్తి సీరియస్ అయ్యారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని మదీనగూడ మసీదు బండ వద్ద ఆపరేషన్ మొదలుపెట్టారు. సర్వే నంబర్ 134లోని సుమారు 4 ఎకరాల జంగంకుంటను ఆక్రమణదారులు మట్టి పోసి పూర్తిగా చదును చేశారు. ఈ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారని అధికారులు గుర్తించారు.

ఈ ఆక్రమణలపై ఇప్పటికే రెవెన్యూ శాఖ కేసులు నమోదు చేసింది. రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా టీం జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, పోలీసుల సహకారంతో కుంట చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది.


హైడ్రా ఏర్పాటు ఉద్దేశం:

2024లో ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా, ఇప్పటి వరకు వేలాది ఎకరాల భూమిని రికవరీ చేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇటీవలి కాలంలో నిర్మాణాలు కూల్చడంతోపాటు తవ్వకాలు కూడా చేపడుతోంది.

ఈ చర్యలతో హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు రక్షణలోకి వస్తున్నాయి. ఆక్రమణదారులకు హైడ్రా ఇదే సందేశం: "ఇకపై ఆక్రమణలకు చోటు లేదు!"

PolitEnt Media

PolitEnt Media

Next Story