నన్ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతారని నాకు ముందే తెలుసని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏసీబీ విచారణకు హజరవడానికి ముందు తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు జైలుకు వెళ్ళడం కొత్తేమీ కాదని తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను అని అన్నారు. ఫార్ములా ఈ రేస్‌ విషయంలో నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు... అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని సవాల్‌ విసిరితే చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయాడని చెప్పారు. మాకు చట్టం అంటే గౌరవం ఉంది... 30 సార్టు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు. కేవలం పైసాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నాపైన కేసులు పెట్టారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసు కేసులో అరెస్ట్‌ చేస్తారని నాకు ముందే తెలుసని వ్యాక్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసే వరకూ ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్ధల ఎన్నికలకు వెళుతున్నారని... బీసీలు అన్నీ గమనిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకూ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏంలేదని కేటీఆర్‌ విమర్శించారు. అందాల పోటీలు పెట్టి ప్రపంచం ముదు తెలంగాణను అభాసుపాలు చేశారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story