Revanth Reddy : ట్యాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే హాజరవుతా - సీయం
కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం బెటర్

ఫోన్ ట్యాపింగ్ అయిన వ్యక్తుల జాబితాలో నా పేరు ఉందో లేదో తెలియదని, ఈ కేసులో నన్ను విచారణకు పిలిస్తే హాజరవుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారన్ని సీయం ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో సొంత కుటుంబ సభ్యుల సంభాషణలు కూడా విన్నారని అంటున్నారు. ఇటువంటి పరిస్ధితి వస్తే ఆత్మహత్య చేసుకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు కానీ ఎవరివైనా ఫోన్లు ట్యాప్ చేయడానికి ముందు సంబంధిత వ్యవస్ధల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కమార్ తన ఫోన్ ట్యాప్ అవుతోందని మొదటి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని సీయం గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు సిట్ ఏర్పాటు చేశామని, సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని, దాన్ని నేను డిక్టేట్ చేయనని సీయం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా స్థానిక ఎన్నికలు మాత్రం ఆగవని, ఈ విషయంలో మా రాజకీయ వ్యూహం మాకుందని సీయం రేవంత్ రెడ్డి అన్నారు.
