సీయం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌ రావు సవాల్‌

దమ్ముంటే పోలీసుల రక్షణ లేకుండా ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్ళాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌ రావు సవాల్‌ విసిరారు. సోమవారం ఓయూలో నూతన హాస్టల్‌ భవనాలు ప్రారంభించడానికి భారీ పోలీసు బందోబస్తు, ఇనుప బారికేడ్ల నడుమ సీయం రేవంత్‌రెడ్డి వెళ్లడంతో ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్ళడంపై హరీష్‌రావు స్పందిచారు. నాడు సబితమ్మ కొబ్బరికాయ కొట్టగా బీఆర్‌ఎస్‌ కట్టినదానికి నేడు రేవంత్‌రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేశాడని విమర్శించారు. గజానికి ఒక పోలీసును పెట్టుకుని నేడు రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లాడని హరీష్‌ రావు ఎద్దేశా చేశారు. సీయం యూనివర్శిటీకి వస్తున్నాడని విద్యార్థులను అరెస్టులు చేశారని, పోలీస్‌ స్టేషన్లో పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని సీయం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఎప్పటిలోగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని ఒక సందర్భంలో ఉస్మానియా యూనివర్శిటీకి వస్తే విద్యార్థులు ఇయ్యర మయ్యర అందుకుంటే సందులో పడి ఉరికిండని మాజీ మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story