స్కూళ్లకు ముఖ్యమైన సూచనలు

Transport Department:ఈ నెల 12 నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున, విద్యార్థుల రవాణా కోసం స్కూళ్ల వాహనాలు తప్పనిసరిగా ఫిట్ & ఫిట్నెస్ కలిగి ఉండాలని రవాణా శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో 25,677 విద్యాసంస్థల బస్సులు ఉన్నా, ఇప్పటివరకు 17,020 బస్సులు మాత్రమే ఫిట్ & ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయి. మిగతా 8,657 బస్సులు కూడా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్ & ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సిందిగా సూచించారు.

15 సంవత్సరాలను దాటిన విద్యాసంస్థల బస్సులు ఎలాంటి పరిస్థితులలోను రోడ్లపై తిరగకూడదని సూచించారు. ఆ వాహనాల్లో విద్యార్థులను రవాణా చేస్తే, ఆ బస్సులు సీజ్ చేయడం మాత్రమే కాకుండా, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాసంస్థల వాహనాల నిర్వహణ బాధ్యత యాజమాన్యాలదే అని స్పష్టం చేశారు. విద్యార్థులను పరిమితికి మించి తీసుకెళ్లినందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచనలు జారీ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story