బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీతకు టికెట్‌ కేటాయించింది. ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌ తీసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరును అధికారికంగా వెల్లడించింది.

ఈ ఏడాది జూన్‌ 8న అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్‌ కన్నుమూయడంతో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.

ప్రజల మద్దతు కావాలి: మాగంటి సునీత

అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. పార్టీ తనపై నమ్మకంతో ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ ప్రజల మద్దతు, ఆశీర్వాదం తనకు లభించాలని కోరుకుంటున్నట్లు సునీత పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story