Telangana Jagruti President Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరుతోనే కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరు ఇప్పుడు ఫ్రీ అయిందని, ఎవరైనా ఆ పేరును వాడుకోవచ్చని అన్నారు.

ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని కవిత స్పష్టం చేశారు. తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరని, బీఆర్‌ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు.

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపుపై కూడా కవిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచడం మధ్యతరగతి తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోందని అన్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

తక్షణం ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని కవిత డిమాండ్ చేశారు.

Next Story