K. Kavitha: తెలంగాణ రక్షణసేన ఐదు ప్రధాన అంశాలను అజెండాగా తీసుకుని ముందుకు సాగుతుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడం తమ ముఖ్య లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. ఎంత తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చినా పేదలకు ఉచితంగా చికిత్స అందే విధంగా వ్యవస్థ ఉండాలని ఆమె అన్నారు.

బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని, కొన్ని చోట్ల ధాన్యం కుప్పల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి కల్పనపై మాట్లాడిన ఆమె, ప్రభుత్వ ఉద్యోగాలకే ఉపాధిని పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాలపై ఆలోచిస్తున్నామని కవిత వెల్లడించారు. ప్రభుత్వాలు భర్తీ చేయకుండా వదిలేసిన బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story