Kadiyam Srihari: కడియం శ్రీహరి: ఉపఎన్నికలు వచ్చినా మళ్లీ పోటీకి సిద్ధం..!
మళ్లీ పోటీకి సిద్ధం..!

Kadiyam Srihari: ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్‌పై స్పీకర్ నుంచి నోటీసు వచ్చినట్లు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానం సమర్పించాలని ఆ నోటీసులో సూచించారని ఆయన చెప్పారు. ఈ విషయంపై మరిన్ని రోజులు సమయం కావాలని స్పీకర్‌ను అభ్యర్థించామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. స్పీకర్ ఇచ్చిన గడువులోగా అవసరమైన వివరాలు అందజేస్తామని, ఆయన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
‘‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాను. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాను. కడియం శ్రీహరికి ఎలాంటి భయమూ లేదు. ఉపఎన్నికలు వచ్చిన సందర్భంలో కచ్చితంగా మళ్లీ పోటీ చేస్తాను. ప్రజలు నన్ను మరోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉంది’’ అని కడియం శ్రీహరి అన్నారు.

