Kavitha: ‘బాయి బాట’ కార్యక్రమం చేపట్టినందుకు రాజకీయంగా తమను అడ్డుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పోలీసులను ఏర్పాటు చేశారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఎంత అడ్డుకుంటే అంత బలంగా ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు.

బాయి బాట కార్యక్రమం భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టును కవిత సందర్శించారు. అక్కడ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ఉద్యోగులకు తగిన సౌకర్యాలు, సరైన యంత్రాలు, పనిముట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

సింగరేణి కార్మికులకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story